Cadbury 5 Star Party Ad | Father Car Keys | తిన్నారంటే ... మర్చిపోయినట్టే
కాడ్బరీ అనేది బ్రిటిష్ మల్టీ నేషనల్ చాక్లెట్ కంపెనీ. దీని వ్యవస్థాపకుడు జాన్ కాడ్బరీ. ఇది Mondelez international యాజమాన్యంలో ఉంది. ఇది ప్రపంచం లోని రెండవ అతి పెద్ద చాక్లెట్ బ్రాండ్. దీని ప్రధాన కార్యాలయము లండన్ లోని, ఉక్ష్ బ్రిడ్జి లో వుంది. దీని ప్రసిద్ధ ఉత్పత్తి ఐన డైరీ మిల్క్ చాక్లెట్ ను ప్రప్రంచ వ్యాప్తంగా 50 కి పైగా దేశాలలో విక్రయిస్తుంది.
1824 లో జాన్ కాడ్బరీ యుకే లోని బర్మింగ్ హోమ్ లో ఒక కిరాణ దుకాణం ప్రారంభించాడు. వివిధ రకాల కోకో మరియు డ్రింకింగ్ చాక్లెట్ లను ఉత్పత్తి చేసాడు. 1847 లో జాన్ కాడ్బరీ తన సోదరుడైన బెంజమేన్ భాగస్వామ్యంతో కంపెనీ “కాడ్ బరీ బ్రదర్స్” గా మారింది. 1850 ల చివరి లో కంపెనీ నష్టాలకు గురైంది. 1861 లో జాన్ కాడ్బరీ కుమారులు రిచర్డ్ మరియు జార్జ్ లు వ్యాపారం చేపట్టారు. 1864 నాటికి కంపెనీ మళ్ళి లాభాల బాట పట్టింది. 1870 లో తన ఉత్పత్తులును ఎగుమతి చేయడం ప్రారంభించింది. 1897 లో కాడ్బరీ తన సొంత మిల్క్ చాక్లెట్ బార్ లను ప్రవేశ పెట్టింది. 1899లో కాడ్బరీ ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ గా మారింది. 1905 లో కాడ్బరీ డైరీ మిల్క్ బార్ ను ప్రారంభింది. డైరీ మిల్క్ బార్ ను జార్జ్ కాడ్బరీ జూనియర్ అభివృద్ధి చేసాడు. పర్పుల్ రేపర్ తో కోకో కలిపిన మిల్క్ చాక్లెట్ రుచి కంపెనీ అమ్మకాలను విపరీతంగా పెంచాయి. ఒక బ్రిటిష్ కంపెనీ మిల్క్ చాక్లెట్ ను ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. 1914 నాటికి, కాడ్బరీ అమ్మకాలలో ఎగుమతులే 40 శాతం దాటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల కాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ ల వివరాలు :-
Cadbury Dairy Milk - Milk Chocolate, Salted Caramel, Whole nut, Fruit Nut, Mint Crisp, Top Deck, Biscuit, Run & Raisin, Cashew & Coconut, Top Deck Mint, Cadbury Dairy Milk Oreo, Caramell, Cadbury Dairy Milk Bubbly Milk Chocolate, Mint, Bubbly Top Deck, Bubbly Oreo, Cadbury Dream White, Cadbury Dream Biscuit, Cadbury Bournville, Lunch Bar, Lunch Bar Dream, P.S.Milk Chocolate, P.S. Caramilk, P.S. Duo, Cadbury 5 Star, Cadbury Crunchie, chomp, flake, flake dipped, Cadbury Original Snacker, Cadbury Astros, Cadbury tumbles short cake, tumbles raisins, Cadbury Whispers etc.,
ఇక ప్రస్తుత ఈ ఆడ్ గురించి చెప్పుకుంటే రమేష్, సురేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు, రాత్రి పార్టీకి వాళ్ళ నాన్నకి తెలియకుండా ఆయన కార్ తీసుకు వెళ్దాం అనుకుంటారు. కాడ్బరీ 5 స్టార్ చాక్లెట్ తింటున్న రమేష్ మైమరచి పోయి ఈ విషయం వాళ్ళ నాన్నకే చెప్తాడు. వెరీ ఫన్నీ. కాడ్బరీ చాక్లెట్ కంపెనీ వారు తీసే ads చాల భిన్నంగా, వాస్తవికానికి దగ్గరగా, ఎన్నో రోజులు గుర్తుండి పోయేలా, మనసుకు హత్తుకునేలా చిత్రీకరిస్తారు.
0 Comments