Trisha & Comedian Ali - NAC Jewelers Telugu Ad

 

100 సంవత్సరాల క్రితం1917 లో నాదెళ్ళ నారాయణ చెట్టి తన ఇంట్లో ఒక చిన్న ఆభరణాల వ్యాపారం ప్రారంభించాడు. అతని కుమారుడు నాదెళ్ళ అనంతం చెట్టి, పాత మద్రాసు లోని ప్యారిస్ కార్నెర్ లో ఒక చిన్న దుకాణం ప్రారంభించాడు.  వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. నాదెళ్ళ అనంతం చెట్టి కుమారుడు, నాదెళ్ళ ఆంజనేయులు చెట్టి, NAC జ్యువెలర్స్ ను స్థాపించాడు.  

నాదెళ్ళ ఆంజనేయులు చెట్టి కుమారుడు అనంత పద్మనాభం NAC జ్యువెలర్స్ ను అతి పెద్ద నగల వర్తక దుకాణాలు గా మార్చాడు. అంతేకాకుండా ఒక్క చెన్నై లోనే 8 షోరూంలు కాకుండా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మరొక షోరూం ను 2016 లో ప్రారంభించారు. అనంత పద్మనాభం కుమారుడు ఐదవ తరానికి చెందిన ఆనంద రామానుజం  NAC జ్యువెలర్స్ కి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. 

Young Ones, Stylori – (Light weight Diamond & Gold Jewellery), Rewind, Fabula (White Gold and Pearls), Muhurtham (Marriage Jewellery) ఇవి వీరి ప్రత్యెక కలెక్షన్స్. ఇంతే కాకుండా దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో, గోన గన్నా రెడ్డి గా అల్లు అర్జున్ నటించిన “రుద్రమదేవి” చిత్రంలోని రాణి పాత్రకు అవసరం అయిన పురాతన designs తో రాజ ఆభరణాలును తయారు చేసిన ఘనత NAC జ్యువెలర్స్ కి దక్కింది.

హాస్య నటుడు అలీ తెలుగు పండితుడుగా, హీరొయిన్ త్రిష తెలుగు నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి గా బాగా నటించారు.